బాపట్ల పార్లమెంట్లోని నాగులుప్పలపాడు మండలంలో కనపర్తి గ్రామంలో పదో శతాబ్దమునకు సంబంధించిన శివాలయంలో గుర్తు తెలియని దుండగులు నందీశ్వర విగ్రహం పగలకొట్టి వెళ్లారు. ప్రజా ప్రతినిధులను నిలువరించేందుకు అనుక్షణం ఆలోచనలు నిర్మాణం చేసే సీఎం జగన్ ప్రభుత్వం, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి అసాంఘిక శక్తుల విషయంలో మాత్రం మౌనం వహించడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. తక్షణమే ప్రభుత్వం విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.