పాన్, ఆధార్,మరియు మి వ్యక్తిగత వివరాలను ఎవరికి షేర్ చేయకండి. సైబర్ మోసగాళ్ళ వలలో పడకండి అని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ తెలియజేసారు. మి పాన్, ఆధార్ వంటి వివరాలను తెలియని వ్యక్తికి లేదా ఏదైనా సంస్థలకు పంపితే వారు వాటిని చట్ట విరుద్ధ పనులకు ఉపయోగించ వచ్చు కాబట్టి వాటిని గోప్యంగా ఉంచుకోండి. అలానే ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే 1930 నంబర్ కి ఫిర్యాదు చేయండి అని పోలీస్ శాఖా తెలియజేసింది.