యూపీలోని లఖ్‌నవూలో దారుణం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మహిళ (55) స్థానిక ఆశ్రమంలో ఉంటోంది. ఆమెకు అక్టోబర్ 4న నిందితులు మత్తు మందు ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని నిందితులు బెదిరించారు. దీనిపై గోమతినగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.