08.10.2022 తేదీన కాకినాడ జిల్లా, పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామం శివారులో జరిగిన యువతి కాదా దేవిక హత్య ఉదంతం అందరికీ తెలిసిందే. సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వo మరియు జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర DGP గార్ల ఆదేశాల మేరకు దిశా స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తు ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా చేయడం జరిగింది. ప్రాధమిక దర్యాప్తు లో భాగంగా సంఘటన స్థలం వద్దనే ముద్దాయిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది. శవపంచనామా నిర్వహించిన వెంటనే సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ముద్దాయి గుబ్బల వెంకట సూర్యనారాయణ, A/27 సంవత్సరములు, n/o బాలవరం గ్రామం, రంగంపేట మండలం, ప్రస్తుతం కూరాడ గ్రామం, కరప మండలం అనే అతనిని 24 గంటల లోపే అరెస్ట్ చేసి రిమాండు నిమిత్తం గౌరవ ప్రిన్సిపాల్ జునియర్ సివిల్ జడ్జ్ కోర్టు కం జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, కాకినాడ వారి వద్దకు పంపగా కోర్టు వారు అతనికి 15 రోజులు రిమాండు విధించడం, అతనిని కాకినాడ సబ్ జైలు కు తరలించడం జరిగాయి. కేసులో అవసరమైన సాక్షులనందరిని విచారించడం జరిగింది. ముఖ్యమైన సాక్షులను కోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని కోర్టులో హాజరు పరచి కోర్టు నందు వారియొక్క వాంగ్మూలాలు నమోదు చేయించడం జరిగింది. పోస్టుమార్టం నివేదిక ను వెంటనే తీసుకోవడం, డాక్టర్ ప్రిజర్వ్ చేసిన మరియు దర్యాప్తు అధికారి స్వాధీనం చేసుకొన్న మెటిరియల్స్ అన్నింటినీ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కు పంపడం మరియు వాటి నివేదిక లు తెప్పించుకోవడం అన్నీ చాలా వేగవంతంగా చేయడం జరిగింది. ఈ కేసులో సంబంధిత సాక్షులనందర్నీ విచారించి త్వరితగతిన అంటే సంఘటన జరిగిన కేవలం 7 పనిదినాల లోపే అనగా 17.10.2022 తేదీన ఛార్జ్ షీట్ దాఖలు చేయడమైనది. ముఖ్యమంత్రి యొక్క దిశా స్ఫూర్తితో, DGP దిశానిర్దేశాల ప్రకారం, కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు నిరంతర పర్యవేక్షణలో అడిషనల్SP శ్రీ పి.శ్రీనివాస్ & కాకినాడ DSP భీమారావు, CIకె.శ్రీనివాసు& పెదపూడి SI వాసు ల బృందం దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేశారు.