సమాజంలో రోజు రోజుకి సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి తస్మాత్ జాగర్త అంటున్నారు పల్నాడు జిల్లా పోలీస్ వారు. సైబర్ నేరగాళ్లు మీ ఆధార్ వేలిముద్రలను ఉపయోగించి మీ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు జాగ్రత్త. మీ యొక్క వేలి ముద్రలను ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి భద్రపరచుకోండి. అలానే 4G నుంచి 5G కి సిమ్ అప్డేట్ ఫ్రీగా చేసుకోవచ్చు అంటూ వచ్చే SMS లలో ఉండే లింకులపై క్లిక్ చేసి మోసపోకండి అని తెలియజేస్తున్నారు. ప్రజలు ఇది గమనించి ఆలోచన కలిగి ఉండాలని కోరుతున్నారు.