విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది అక్టోబరు 17న ఫైర్ క్రేకర్ షాపులు, క్రేకర్స్ అక్రమ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి, ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా క్రేకర్స్ కలిగివున్న వారిపై కేసులు నమోదు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో ఎక్కడ అవాంఛనీయమైన కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకి ఎస్పీ ఆదేశించారు.