కాకినాడ జిల్లా పోలీసు అధికారులతో, కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నందు, ఎస్.సి. /ఎస్.టి. అట్రాసిటీస్ నిరోధక చట్టం 1989 కేసులుపై నేర సమీక్షా సమావేశంను నిర్వహించి, ఆయా కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, దర్యాప్తు అధికారులుకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసిన కాకినాడ జిల్లా ఎస్.పి. శ్రీ ఎం.రవీంద్రనాథ్ బాబు, ఐ.పి.ఎస్.
ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ దర్యాప్తులో & కోర్టు విచారణలో ఉన్న అన్ని ఎస్.సి. /ఎస్.టి. అట్రాసిటీస్ నిరోధక చట్టం 1989 కేసులుపై సమీక్ష నిర్వహించినారు. SC/ST . అట్రాసిటి కేసులలో దర్యాప్తును నిర్దిష్ట సమయంలో పూర్తి చేసి, నిందితులపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి, తగిన సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దర్యాప్తు పూర్తి అయిన కేసుల్లో ఛార్జ్ షీట్లు ఏ విధమైన ఆలస్యం లేకుండా ఫైల్ చేసి, కోర్టు నందు విచారణ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో కేసుల దర్యాప్తును వేగముగా పూర్తి చేయాలని సూచించారు.