విజయవాడ పరిధిలో 15వ డివిజన్ పుట్ట రోడ్డుకు చెందిన ప్రదీప్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించగా వారి కుటుంబ అవసరాల కోసం బెల్లం దుర్గ ₹ 75,000 & దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹25,000, 68వ సచివాలయ వలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న వారి భార్య నాగరజనీ గారికి అందజేయడం జరిగింది అని దేవినేని అవినాష్ తెలియజేసారు. అలానే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 3వ డివిజన్ కు చెందిన షేక్ నజీమా క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం అయన దృష్టికి రాగా వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు నిమిత్తం ₹ 10,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది.