జాతీయ ఆహారభద్రతా చట్టం - ఇతర పథకాలు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అవసరాలను ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద తగినన్ని నిల్వలున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల మొదటి తేదీ నాటికి సుమారు 227 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ, 205 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం వద్ద నిల్వ ఉన్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి సుమారు 113 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ, 237 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం వద్ద నిల్వ ఉండవచ్చని అంచనా వేసినట్లు కూడా తెలియచేశారు.