మున్సిపల్ పారిశుధ్య కార్మికుల పనితీరు మెరుగు గా ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పులివెందుల పట్టణంలో స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సచివాలయ అడ్మిన్, అమెనిటీ, శానిటేషన్, డేటా ఎంట్రీ, ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న సంపూర్ణ శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతేకాక శానిటరీ సెక్రటరీలు ఇంటింటి చెత్త సేకరణ వాహనాల నిర్వహణ, వాటి కార్మికుల పనితీరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమెనిటీ సెక్రటరీలు అక్రమ కొళాయి కనెక్షన్లను గుర్తించి వాటిని రెగ్యులర్ చేయించాలన్నారు. సెక్రటరీలు వారి విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.