ఉపాధి హామీ బిల్లులు నిధులు విడుదల చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మంగళవారం కోరారు. పెదకూరపాడు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులను, జిల్లా మంత్రులను ఆయన కోరారు. శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉండడానికి నిధులు కూడా కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.