లక్ష మందితో రజక రణభేరి గుంటూరు విజయవాడ మధ్య సభ ఏర్పాటు చేస్తామని మంగళవారం ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు అన్నారు. ఎప్పటినుంచో ఉన్న రజక సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తామని రాజకీయంగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ లో ఉన్న ఆ రెండు కులాలకు తప్ప మరీ ఏ ఇతర కులాలకు రాజకీయ అవకాశం లభించడం లేదని కులానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ తప్ప ఎలాంటి రాజకీయ చైతన్యము లేదని ,రాజకీయ అవకాశం కల్పించాలని రజకుల గ్రామ బహిష్కరణలు, రజకులు పై జరుగుతున్న దాడులు, రజక చెరువులు కబ్జాలు అనేక సమస్యలపై ఈ రజక రణభేరి లో చర్చిస్తామని సభ తేదీని త్వరలో కార్యవర్గంతో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు.