గత సంవత్సరం వైసీపీ కార్యకర్తలు , టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇది జరిగి సరిగ్గా సంవత్సరం . దేనిని గుర్తు చేసుకుంటూ... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై ఏడాది క్రితం ఇదే రోజున వైసీపీ గూండాలు దాడిచేస్తే, ఈ జగన్ సర్కార్ ఇప్పటివరకు ఆ రౌడీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పై దాడి విషయంలో ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్యానికి చేటు. రౌడీ, రాక్షస రాజకీయాలకు చెక్ పెట్టకపోతే మనం ముందడుగు వేయలేం. అందుకే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. వ్యవస్థలను ధ్వంసం చేసి, చట్టాలను అతిక్రమించి సాగుతున్న ప్రజా వ్యతిరేక, విధ్వంసకర పాలనపై పోరాటానికి నడుం కట్టాలి అని పిలుపునిచ్చారు.