ఈనాడు అధినేత రామోజీరావు మీద వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... 1983 ఎన్నికల ప్రచారంలో వివిధ భంగిమల్లో ఎన్టీఆర్ పోస్టర్లు, కరపత్రాలు, స్నానఘట్టాలు, రోడ్డుపక్కన నిద్రాహారాలు, సహపంక్తి భోజనాల ఫోటోలు వేసినందుకు కుల రాజగురువు రాము ఎన్టీఆర్ కు 30 లక్షల బిల్లు ఇవ్వబోయాడు. నా "ఈనాడు"లో ప్రచారం చేసి నిన్ను గెలిపించి, సీఎంను చేశాను...అన్న రాము మాటలకు ఎన్టీఆర్ ఆత్మాభిమానం దెబ్బతిని కోపం వచ్చింది. "నా ఫోటోలు, పాపులారిటీ వాడుకుని నీ పేపర్ సర్క్యూలేషన్ పెంచుకున్నావు. కాబట్టి నువ్వే నాకు 30 లక్షలు కట్టమని ఎన్టీఆర్ బదులిచ్చారు. రాముకి వెంటనే "పత్రికా స్వేచ్ఛ" గుర్తుకొచ్చి సరికొత్త ప్రహసనానికి తెరలేపాడు. వెంటనే అసందర్బంగా ఎన్టీఆర్ ని అవహేళన చేస్తూ "ఈనాడు"లో వెకిలి కార్టూన్లు వేసి "బ్లాక్ మెయిల్" చేశాడు ఈ నీచుడు రాము. ప్రజానాయకుడు ఎన్టీఆర్ కు కులనాయకుడు రాముతో లడాయి దీంతోనే మొదలైంది. ఆ తర్వాత ఘట్టమే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచేందుకు "వైస్రాయ్ కుట్ర"కు చంద్రం-రాము తెర తీశారు. ఆ రోజు చంద్రం బలం 47. ఈ సంఖ్య మధ్యాహ్నంకి 70, రాత్రికి 100, మరునాటికి 150గా చూపింది ఈనాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడ్ని చేయడమేనా పత్రికా స్వేచ్ఛ రాము? అని ప్రశ్నించారు.