మైలవరం జలాశయానికి వరద నీరు పెరిగింది. రైతు ప్రాంతంలోని చాగల్లు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నీరు గండికోట జలాశయానికి చేరుతుంది. దీంతో గండికోట నుంచి ఏడు గేట్ల ద్వారా మైలవరం జలాశయానికి సాగు నీటి ప్రవాహం. పెరిగింది. మైలవరం జలాశయంలో 5. 5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో గండికోట నుంచి వచ్చే నీటిని యధావిధిగా పెన్నా నదిలోకి వదలగా 35 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.