పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం నుండి వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశం పార్టీలోకి 20 కుటుంబాలు పెదకూరపాడు నియోజవర్గం మాజీ శాససభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ సమక్షంలో చేరినారు. బుధవారం వైకుంఠపురం గ్రామ నాయకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సౌరీలు, విష్ణు, వసంతరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.