ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 03:13 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... మంత్రి కన్నా బాబు మాట్లాడుతూ.... పవన్ కళ్యాణ్  పక్కన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను కూర్చోబెట్టుకున్నాడు. ఆ పార్టీలో ఏ కాపు నాయకులకూ కనీసం కుర్చీ వేయలేదు. ప‌వ‌న్‌ పక్కన కూర్చోవడానికే కాపులకు అర్హత లేదు. అలాంటప్పుడు నువ్వు కాపులను ఎలా ఉద్దరిస్తావు ప‌వ‌న్‌..? నీ పార్టీకి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాత ఎవరెవరో అందరికి తెలుసు. రంగా హత్యకు బాధ్యుడు ఎవరో తెలుసా..? ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో చంద్రబాబే రంగ హత్యకు బాధ్యులు అని రాశారు.. అదే చంద్రబాబు చంకలో కూర్చొని రంగా దారుణ హత్య గురించి కన్నీళ్లు కారుస్తావా? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com