వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం లో జరిగిన వాదనలలో భాగంగా సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని నిన్న సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ తరపున సునీతారెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. సునీతా రెడ్డి పిటిషన్‌లో చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ స్పష్టం చేసింది. విచారణాధికారిపైనే నిందితులు కేసులు పెట్టారని సీబీఐ పేర్కొంది. మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తానన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని సీబీఐ తెలిపింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి 164 స్టేట్‌మెంట్ అడిగారంటూ శంకరయ్య లేఖ రాశారని సీబీఐ స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని, అందుకే విచారణ జాప్యం అవుతోందని సీబీఐ వెల్లడించింది. సునీతారెడ్డి వాదనలన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది.