దేశంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులూ రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నేడు అయన కర్నూలులో పర్యటించారు. ఈ క్రమంలోనే రాహుల్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామన్నారు. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నారు. మూడు రాజధానుల ఆలోచన సరికాదన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పోలవరం పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రాహుల్ ప్రకటించారు.