విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో అక్టోబరు 18న విజయనగరం 1వ పట్టణ ఎస్ఐలు అశోక్, దుర్గా ప్రసాద్ మరియు సిబ్బంది పట్టణంలోని రామానాయుడు రోడ్డులో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.9,700/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంఘ విద్రోహ చర్యలకి పాల్పడితే చట్టం ద్వారా కఠిన శిక్షల పాలవుతారు అని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలానే వల్లంపూడి ఎస్ఐ శ్రీ రాజేష్ మరియు సిబ్బంది పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.4,600/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.