ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమతులు లేనిదే టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 10:25 AM

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ అనుమతులు లేనిదే టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా  స్థానిక త్రీటౌన్ సి.ఐ కత్తి శ్రీనివాసులు స్పష్టం చేశారు. స్థానిక రంగస్వామినగర్ , 5 వ రోడ్డు, 6 వ రోడ్డు, మిత్ర సర్కిల్ , తదితర ప్రాంతాలలోని కిరాణ మరియు ఇతర దుకాణాలలో తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా టపాసులు నిల్వ చేయడం, విక్రయించడం చేస్తే చర్యలు తప్పవని సూచించారు. త్రీటౌన్ సి.ఐ తో పాటు ఎస్సై రంగడు యాదవ్ , సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com