నారా చంద్రబాబు అలానే నందమూరి బాలకృష్ణ లని ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. "క్రూర రాజకీయాలే…కుటుంబ, మానవ విలువలు ఎక్కడ? ఒకరు పిల్లనిచ్చిన మామకు ద్రోహం. 1296లో జలాలుద్దీన్ ఖిల్జీని విందుకు పిలిచి అల్లుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ హత్య చేసి తనను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నాడు. నారాది అదే ఆటవిక న్యాయం! మరొకరు కన్నతండ్రికి ద్రోహం చేసిన చరిత్రహీనుడు.1657లో ఔరంగేబు తన తండ్రి, మొఘల్ చక్రవర్తి షాజహానును నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి కూలదోసి, చనిపోయే వరకు జైల్లో బంధించాడు. ఇప్పుడు ఎవరిని ఎవరితో పోల్చవచ్చో మీరే నిర్ణేతలు" అంటూ సంధించారు.