ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణనాధుని సేవలో కేంద్ర ఆర్థిక మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 11:10 AM

కేంద్ర ఆర్థిక మంత్రి, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌లు బుధవారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. వీరికి కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌, పూతలపట్టు ఎంఎల్‌ఎ ఎంఎస్‌ బాబు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో రాణాప్రతాప్‌, చిత్తూరు ఆర్డీఓ రేణుక స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రులకు పండితుల ఆశీర్వాదంతో పాటు, ప్రసాదాలను అందించారు. చిత్తూరు ఎంపి రెడ్డెప్ప స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com