ఈ కేవైసీ చేసుకున్న వారికే ప్రయోజనాలు అందుతాయని బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో 6065 మంది రైతులు ఉండగా 5615 మంది రైతులు ఈ కేవైసీ చేసుకున్నారని చెప్పారు. ఇంకా 450 మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. మిగిలిన రైతులు వెంటనే ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా చెప్పారు. రైతు భరోసా సొమ్ము పంట నష్టపరిహారం అందాలంటే నమోదు అవసరమని చెప్పారు.