టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30% మాత్రమే ఉన్నాయంటూ భారత్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. టీ20 క్రికెట్ లో ఒక మ్యాచ్ గెలిచే టీమ్ తర్వాతి మ్యాచ్లో ఓడిపోవచ్చని, భారత జట్టు వరల్డ్కప్ సెమీస్కు చేరుతుందా అంటే అనుమానమేనని అన్నారు. హార్దిక్ పాండ్యాలాంటి ఆల్ రౌండర్, విరాట్, రోహిత్, రాహుల్ లతో కలిసి సూర్య ఉండటం జట్టును బలంగా మారుస్తుందని కపిల్ అన్నారు.