జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఒక కప్పు గడ్డ పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కండిషనర్ కూడా రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు మెరుపు వస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.