పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఒక పోలీసు అధికారి వద్ద ఉన్న గన్ అనుకోకుండా పేలింది. ఓ మొబైల్ షాప్ కి వెళ్లిన పోలీస్ తన తుపాకీని బయటకు తీశాడు. అక్కడున్న వారికి దానిని చూపించాడు. ఇంతలో ప్రమాదవశాత్తూ కాల్పులు జరిగాయి. దీంతో మొబైల్ షాపులో పనిచేస్తున్న యువకుడు గాయపడ్డాడు. నిందితుడైన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వారిందర్ సింగ్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల వాంగ్మూలం మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.