బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఇది 22వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత 48 గంటల్లో తుఫాన్ గా బలపడే అవకాశముందని తెలిపింది. ఇది ఏపీ-ఒడిశా తీరం వైపు వచ్చినా మధ్యలో దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా-పశ్చిమబెంగాల్ వైపు కదులుతుందని, ఏపీకి తుఫాన్ ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు.