ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 11:48 AM

అనారోగ్యంతో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న గిరిజన విద్యార్థిని మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం కీసర గ్రామానికి చెందిన పత్తిక నందిని (17) భద్రగిరీ పీటీజీ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే గత కొంత కాలంగా కడుపులో నొప్పితో బాధపడుతోందని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో చేర్చామని ఐటీడీఏ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కేజీహెచ్‌లో నందిని మృతి చెందినట్లు తెలిపారు. స్వగ్రామంలో దహన సంస్కరణలు నిర్వహించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com