ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని మార్కాపురం అడ్డరోడ్డు ఒంగోలు కర్నూల్ జాతీయ రహదారిపై ఉన్న ప్రమాదకర గుంతలో ఆటో దిగడంతో అదుపుతప్పి జాతీయ రహదారి పై ఆటో బోల్తా పడింది. గురువారం జరిగిన ఈ సంఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమయానికి ఒంగోలు కర్నూల్ జాతీయ రహదారి పై వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు రవాణా శాఖ అధికారులు మరమ్మత్తులు చేయకుండా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa