కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ఒంటిమిట్ట మండల పరిధిలోని గ్రామ వాలంటీర్లు గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారని టిడిపి సీనియర్ నాయకులు కొమర వెంకట నరసయ్య ఆరోపించారు. ఆయన గురువారం స్థానిక హరిత హోటల్ లో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు తుంగలో తొక్కి ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీకి వాలంటీర్లు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.