వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి, ఇప్పటి వరకు రూ.40 వేల కోట్ల విలువైన భూములను కొట్టేసిన జగన్రెడ్డి భూములు, హక్కులు, సర్వేలంటూ శ్రీరంగనీతులు చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విమర్శించారు. రైతుల భూములకు సీఎం జగన్ ఫొటోలతో హక్కు పత్రాలు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. జే ట్యాక్స్ వసూళ్ల కోసమే నిషేధిత భూముల జాబితాను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు.