కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు సహజీవనం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఓ యువతి ఇటీవల మరో యువతితో సన్నిహితంగా ఉంటోంది. దీనిని సహించలేక మరో యువతి గురువారం తన ప్రియురాలి మెడ, చేతులపై రేడియం కట్టర్‌తో దాడి చేసింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa