రైతులు ఎక్కడైనా తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం చూశామా..? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. రైతులను అడ్డుపెట్టుకొని రాష్ట్ర సంపదను దోచుకోవాలని చూస్తున్నారన్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎలా పోటీ చేస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అనాధిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ కుటిలయత్నాలు చేస్తోందని, అమరావతి యాత్ర వందశాతం టీడీపీ యాత్రేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు.