షిమ్లాలో బీజేపీ తరపున ఛాయ్ వాలా సంజయ్ సూద్ శనివారం తన నామినేషన్ వేశారు. షిమ్లా అర్బన్ నియోజకవర్గానికి ఆయన హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలో నిలిచారు. ఈ సీటు నుంచి 4 సార్లు మంత్రిగా గెలిచిన సురేష్ భరద్వాజ్ ను ఈ సారి కసుంప్టి నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలో నిలిపింది. పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సురేశ్ భరద్వాజ్ గెలవాలని కాంక్షించారు. 1991 నుంచి సంజయ్ సూద్ టీ షాప్ నడుపుతున్నారు.