మూడు రాజధానులపై హైడ్రామా నడుస్తోంది. మూడు రాజధానుల కోసం రాజీనామా చేసే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారంటూ ఓ అభూత కల్పనకు యత్నం జరుగుతోంది. రైతుల పాదయాత్ర విశాఖ చేరుకుంటున్న నేపథ్యంలో రాజీనామాల వ్యూహానికి నేతలు ప్లాన్ చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు.. అనుమతి ఇవ్వాలని నిన్న సీఎం జగన్‌ను కోరిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరగా.. జగన్ వారించినట్టుగా అనుకూల మీడియా కొన్ని లీకులను ప్రసారం చేస్తోంది. 3 రాజధానుల ఉద్యమంలో మరింత క్రియాశీలకంగా ఉండేందుకు.. రాజీనామా చేస్తామని ధర్మాన చెప్పగా సీఎం జగన్ వారించి.. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుందామన్న సీఎం జగన్ చెప్పినట్టుగా ఆ ఆడియోలో ఉంది.