T20 వరల్డ్ కప్ 2022, అసలైన సిసలు సూపర్ 12 యుద్ధం ఘనంగా ప్రారంభమైంది. న్యూజిలాండ్ విధ్వంసక బ్యాటింగ్ బౌండరీలతో హోరెత్తింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో న్యూజిలాండ్ ప్రత్యర్థి ముందు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ డావన్ కాన్వే (58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. ఫిన్ అలెన్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు). తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 2 సిక్సర్లతో 26 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. జంపా ఒక వికెట్ తీశాడు. ఈ బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై లక్ష్యం పెద్దది కాదు. మరి ఆసీస్ ఏం చేస్తుందో చూడాలి.