గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల క్రితం జీజీహెచ్‌లో ఆరేళ్ల వర్షిత్‌ను గుర్తుతెలియని మహిళ తీసుకెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడికి తీసుకెళ్లిన మహిళ నగరంపాలెంకు చెందిన మహిళగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే బాలుడిని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో గ్రామంలో బంధువులకు అమ్మినట్లు సదరు మహిళ వెల్లడించింది. గత నెల 23న అరండల్ పేటలో అదృశ్యమై నాలుగేళ్ల ప్రకాష్‌ను అపహరించి అమ్మినట్లు విచారణలో మహిళ ఒప్పుకుంది. ఇద్దరు చిన్నారులు ప్రకాష్, వర్షిత్లను జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరు తీసుకొచ్చారు. జీజీహెచ్ బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.