శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,64,546 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,45,205 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.8824 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.