అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాల ధర లీటరుకు రూ.2.50 చొప్పున పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సెప్టెంబరు 1 నుంచే అమలులోకి వస్తుందని తెలియజేసారు. గతంలో అంగన్వాడీలకు సరఫరా చేసే పాలకు లీటరుకు రూ.49.75 చెల్లిస్తుండగా.. ఇప్పుడు దానిపై రూ.2.50 పెంచి లీటరు ధర రూ.52.25గా నిర్ణయించింది. అయితే 200 ఎంఎల్, 180 ఎంఎల్ ప్యాకెట్లకు కూడా రూ.2.50 పెంచుతూ లీటరు ధరను రూ.58గా నిర్ణయించింది. హైపవర్ కమిటీ సిఫారసులమేరకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.