వికేంద్రీకరణకు మద్దతుగా శుక్రవారం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బొత్స సత్య నారాయణ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే విశాఖ పరిపాలనా రాజధాని కావాలన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఈ ప్రాంత అభివృద్ధి చూడలేని కొందరు ద్రోహులు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. జిల్లాలో అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించే సమయంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో బంద్ పాటించి తమ నిరసన తెలపాలన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు కోసం జేఏసీ చేస్తున్న పోరాటానికి వైసీపీ పూర్తిస్థాయి మద్దతు అందిస్తుందన్నారు.