రూ. 7. 42 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందచేశారు. చిన్నమండెం మండలం కేసాపురం నకు చెందిన నరం లలితమ్మకు రూ 1. 20 లక్షలు, రామాపురం మండలం హసనాపురం చింతల వాండ్లపల్లె కు చెందిన చింతల రామిరెడ్డికి రూ 60 వేలు, రాచపల్లె కు చెందిన సంగరాజు రామరాజు కు రూ 35 వేలు, నీలకంఠరావుపేటకు చెందిన బయారెడ్డికి రూ 25 వేలు, గాలివీడు మండలం పెద్దపల్లె కు చెందిన బండి ఇరగమ్మ కు రూ 25 వేలు, తూముకుంట గ్రామం కుడుముల బయారెడ్డికి రూ 2. 70 లక్షలు, సంబేపల్లె మండలం కొండావాండ్లపల్లెకు చెందిన వసంతు రాధారాణికి రూ 1. 60 లక్షలు, రాయచోటి మండలం ఏపీలంకపల్లె కు చెందిన పత్తికాని రఘు నాధకు రూ 47 వేలు విలువ గల చెక్కులను శ్రీకాంత్ రెడ్డి అందచేశారు. చెక్కులను అందుకున్న లబ్దిదారులు సీఎం జగన్, ఎంఎల్ఏ శ్రీకాంత్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.