అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయ వెనుక భాగంలో ప్రభుత్వ స్థలం 679-2 సర్వేంబర్ నందు 0. 15 విస్తీర్ణం స్థలంలో నున్న అక్రమాలను తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి వారి సిబ్బంది తో పాటు అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి జేసీబీ యంత్రం సహాయంతో శనివారం తొలగించడం జరిగింది.
ఈ స్థలంలో ఎవరైనా కూడా ఎటువంటి నిర్మాణాలు కానీ తాత్కాలిక వ్యాపారాలు కానీ నిర్వహించకూడదని సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు ప్రభుత్వ స్థలంలో నున్న అక్రమ కట్టడాలు తొలగించడం జరిగిందన్నారు. ఎవ్వరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.