ఒక్కోసారి మన చుట్టూ జరిగే చెడును నివారించే ప్రయత్నం చేస్తే అదే మనకు శాపమై కాటేస్తుంది. ఇలాంటి ధారుణమే మధ్యప్రదేశ్ లో జరిగింది. పక్కింటి దంపతుల వివాదంలో తలదూర్చి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఛవాని పత్తర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే... పప్పు అహిర్వార్ అనే వ్యక్తి తన భార్య చికెన్ వండేందుకు నిరాకరించడంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో సహనం కోల్పోయిన పప్పు అహిర్వార్ భార్యను కొట్టడం ప్రారంభించాడు.
ఈ గొడవకు ఇరుగుపొరుగువారు అక్కడ గుమికూడారు. వారిలో బాబు అహిర్వార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. బాబు సహా ఇతరులు ఆ భార్యాభర్తలకు సర్దిచెప్పారు. విషయం అంతటితో సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ పప్పు అహిర్వార్... బాబు అహిర్వార్ పై కోపం పెంచుకున్నాడు. బాబు అహిర్వార్ ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాబు అహిర్వార్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానికులు హమీదియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పప్పు అహిర్వార్ ను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa