చిన్న పిల్లలకు తెలియక విషపూరిత పాములతో ఆడుకుంటుంటారు. ఏ మాత్రం కాటు వేసినా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతాయి. తాజాగా ఇలాంటి ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో కనిపించింది. 11 ఏళ్ల బాలిక తన తాతామామలతో కలిసి బయటికి వెళ్లిన సమయంలో కనిపించిన ఓ పామును చేతిలోకి తీసుకుంటుంది. ఈ వీడియోను Stewy the Snake Catcher అనే ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది. వీడియోలో చిన్నారి పాముకాటుకు గురి కాకపోవడం సంతోషకరమని, పెద్దలు పక్కనే ఉండి హెచ్చరించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa