కృష్ణ జిల్లా, ఉయ్యూరు డివిజన్ లో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు శనివారం ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో గౌరవ పామర్రు , పెనుమలూరు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు , కొలుసు పార్ధసారధి గార్లతో కలిసి సమీక్షించారు . డివిజన్ లో కలెక్టర్ గృహ నిర్మాణ పురోగతి మండల వారీగా సమీక్షిస్తూ లే - అవుట్ల మెరక పనులు , అప్రోచ్ రోడ్డు పనులు నవంబర్ 30 లోగా పూర్తి చేసి గృహ నిర్మాణాలు ప్రారంభం కావాలని , ఇంకా ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని , వర్షాలు పడుతున్నాయని సాకులు చేప్పవద్దన్నారు. గౌరవ శాసన సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారానికి అధికారులు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు . ఈ సమావేశంలో ఆర్ . డి . ఓ . విజయ్ కుమార్ గారు , డ్వామా పీ . డీ . జి . వి . సూర్య నారాయణ గారు , తహశీల్దార్లు , ఎం . పి . డి . ఓ . లు తదితరులు పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa