వ్యక్తులు ఎంత నిజాయితీగా బతకాలన్న మన చుట్టూ ఉన్న దుష్టులు కూడా మనల్ని అదే ప్రపంచంలోకి లాగే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి విషాధ గాధయే అర్చనా నాగ్ నిజజీవితంలో నెలకొంది. బ్లాక్ మెయిలింగ్ , హనీట్రాప్ వంటి ఆరోపణలతో అరెస్టయిన మహిళ అర్చనా నాగ్ వ్యవహారం ఒడిశాలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తన అందంతో, సొగసైన మాటలతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులకు మస్కా కొట్టి వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోల తీసి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడి కోట్లు వెనకేసుకున్నట్టు తేలింది. అయితే, ఆమె ఇలా మారడానికి అధికారులు, రాజకీయ నాయకులే కారణం కావడం గమనార్హం. ఒకప్పుడు అందరిలాంటి ఆడపిల్ల అయిన అర్చన.. తమ కుటుంబానికి, గ్రామానికి జరిగిన అన్యాయంపై ఉద్యమించింది. ఈ నేపథ్యంలో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించి ముందుండి నడిపించింది. ఆ సమయంలో జరిగిన ఓ ఘటన ఆమె జీవితాన్నే మార్చేసి నేర సామ్రాజ్యంవైపు అడుగులు వేసేలా చేసింది.
అర్చనా నాగ్ బంధువు మీడియాతో మాట్లాడుతూ.. ఆమె గురించి పలు అంశాలను వెల్లడించారు. కలహండి ప్రాంతానికి చెందిన అర్చనా నాగ్.. ఓ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడారు. పరిశ్రమ ఏర్పాటు చేసిన సమయంలో తమ గ్రామంలోని భూమిని అధికారులు తీసుకున్నారు. భూములు కోల్పోయినవారికి పరిహారం కింద కొంత మొత్తం ఇచ్చి చేతులుదులుపుకున్నారు. దీనిపై గ్రామస్థులు ఆందోళనలు చేపట్టగా.. దీనికి అర్చన నాయకత్వం వహించింది. దీంతో ఆ పరిశ్రమ యాజమాన్యం కిరాయి రౌడీలతో ఆమెపై అత్యాచారం చేయించింది. ఈ ఘటనతో అక్కడ తలెత్తుకోలేక.. ఆమె కుటుంబం భువనేశ్వర్ చేరుకుంది.
తనపై జరిగిన అత్యాచారం వెనుక ప్రభుత్వ అధికారులు, వ్యాపారుల హస్తం ఉందని భావించిన అర్చన.. వారిపై కక్ష తీర్చుకోవాలని భావించింది. నేర సామ్రాజ్యంలో అడుగు పెట్టి బ్లాక్‌మెయిలర్‌గా మారింది. అటు, ఈ కేసులో అర్చననాగ్ ఆమె భర్త జోగబందులను పోలీసులు అరెస్ట్.. భువనేశ్వర్‌లోని ఝార్పడ కారాగారంలో ఉంచారు. జోగబంధును శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టులో హాజరు పరిచగా ఆయనకు 14 రోజుల కస్టడీ విధించింది.
విచారణలో అర్చన వెల్లడించిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. ఒక మంత్రి, పశ్చిమ ఒడిశాలో గుర్తింపు ఉన్న బీజేపీ నేత, ఎమ్మెల్యేలు, బిల్డర్లు, సినీ నిర్మాతలు, పోలీసు అధికారులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసి షాకయ్యారు. అర్చనతో మంత్రి ఏకంతాంగా ఉన్న చిత్రాలను గుర్తించారు. ఈ ఫోటోలు చూపించి కోట్లు వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతా భర్త జోగ బంధు నాగ్ సహకారంతో నడిచిందని, రహస్య కెమెరాలు అమర్చి, రికార్డు చేయడం అతడే చేసినట్లు తెలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa