దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసులు కాల్చే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ కర్నూలు జిల్లా అధికారి చిన్నబజారి పేర్కొన్నారు. నగరంలో 140తాత్కాలిక టపాసుల విక్రయ దుకాణాలను ఏర్పాటు చేశారని షాపుల యజమానులు అధికారులు తెలిపిన సూచనలు పాటించాలని కోరారు. బాణా సంచా విక్రయించే షాపుల్లో స్టాక్ తక్కువుగా ఉంచుకోవాలన్నారు. చిన్నారులు బాణా సంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి పండుగ ఎంత సంతోషాన్ని పంచుతుందో.. అప్రత్తంగా లేకపోతే.. అంతే విషాదాన్ని కూడా మిగుల్చుతుందన్నారు.