కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ కి వెళ్లిన అమ్మాయి ఇంటికి రాలేదు అని సదరు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన తల్లితండ్రులకి న్యాయం జరగలేదనే చెప్పాలి. ఫలితం రెండు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో శెవమై కనిపించింది. ఐతే ఈ విష్యం మీద టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ....... బిడ్డ కనపడట్లేదు అని పోలీస్ స్టేషన్ల వరకూ వస్తే కూడా అటూ ఇటూ తిప్పి తాత్సారం చేశారు కానీ సత్వర చర్యలు తీసుకోలేదు. లేని దిశ చట్టం గురించి ప్రగల్భాలు పలికే జగన్ రెడ్డి, తానేటి వనిత ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు? పోలీస్ స్టేషన్ వరకూ వస్తేనే దిక్కు లేదు, దిశ యాప్ అంటూ ప్రజలను మోసం చేస్తారెందుకు? పండుగ పూట బిడ్డను పోగొట్టుకొని,కనీసం మహిళా కమీషన్ అన్నా న్యాయం చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడానికి ఒంటికాలిపై వచ్చే వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి కోసం వెంటనే వెతక్కుండా, ఫలానా రెడ్డిపై అనుమానం ఉందని చెప్పినా కనీస విచారణ చేయకుండా నాన్చి, ఆమె మృతికి పరోక్షంగా కారణమైన అధికారులకు ఇవ్వదా మరి నోటీసులు? వాళ్ళపై పెట్టదా ప్రెస్ మీట్లు? జగన్ రెడ్డి, అతడి ఫ్యామిలీ కోసం తప్ప వేరే కేసుల కోసం వాసిరెడ్డి పద్మ మాట్లాడదులే అన్న ధైర్యం అధికారుల్లో, నేరగాళ్ళలో నెలకొంది. తన శాఖ పనితీరుపై పట్టు లేని తానేటి వనిత కు, రెండు స్టేషన్లకు తిరిగినా ఆ అమ్మాయిని కాపాడలేని అసమర్ధ వ్యవస్థలను నడుపుతున్న జగన్ కు వారి వైఫల్యాలకు గానూ నోటీసులు ఇస్తారా? లేని పక్షంలో, మహిళా కమీషన్ ప్రతిష్టను మసకబార్చిన పద్మ తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు.