విద్యుదాఘాతంతో చల్లపల్లి, నడకుదురు శివారు పాత నడకుదురులో పూరిల్లు దగ్ధమైంది. ఎంపీపీ స్కూల్ సమీపంలోని కందుల శేషగిరిరావు నివసించే పూరిల్లుకు మంటలం టుకోవడంతో ఇంట్లో ఉన్న వారు బయటకు వచ్చే లోపు నడికప్పు విరిగి పడిపోయింది. సామగ్రి పూర్తిగా కాలి పోయింది. వంట గదిలో నుంచి గ్యాస్ సిలిండర్ బయటకు తెచ్చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఇంట్లో ఉన్న రూ.18 వేలు, ఉంగరం కాలిపోయినట్లు తెలిపారు. రూ.3 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితులు తెలిపారు. మొవ్వ అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేయగా, వీఆర్వో వివరాలు నమోదు చేసుకున్నారు.